కుత్బుల్లాపూర్, సెప్టెంబర్15: గుండ్లపోచంపల్లిలో వీ కన్వెన్షకు సంబంధించిన కాంక్రీట్ ప్రహరీ ఆనుకొని కార్మికుల కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్డుపై పడడంతో అందులో నిద్రిస్తున్న కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఆరుగురికి తీవ్రగాయాలైన ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. అపర్ణ రెడీమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పని చేస్తున్న కార్మికుల కోసం వీ కన్వెన్షన్ ప్రహరీ ఆనుకొని రేకుల షెడ్డును ఏర్పాటు చేశారు. కాగా వరుసగా కురుస్తున్న వర్షాలకు ఆదివారం అర్ధరాత్రి భూ మి పదునుగా మారి వీ కన్వెన్షన్ హాల్ ప్రహరీ కాంక్రీట్ గోడ ఒక్కసారిగా కూలి రేకుల షెడ్డుపై పడింది.
అందులో నిద్రిస్తున్న ఒడిశాకు చెందిన గగన్‌కుమార్ బిస్వాల్(56) మృతి చెందగా రాజన్‌కుమార్, ప్రకాశ్చాత్రి, కర్మసింగ్, సుధ, చందన్‌కుమార్,ప్రశాంత్‌లకు గాయాలు కాగా స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రి కి తరలించారు. అపర్ణ రెడీమిక్స్ యాజమాన్యంతో పాటు వీ కన్వెన్షన్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.