నగరంలో.. షీటీమ్స్‌కు పెరుగుతున్న ఫిర్యాదులు
నగరంలో మహిళలకు పోకిరీల బెడద పెరుగుతోంది. ఇటీవల కాలంలో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న కొన్ని ఘటనలతో గడపదాటి బయటకొచ్చి తిరిగి ఇల్లు చేరేవరకు ఆకతాయిల బెడదతో మనోవేదన అనుభవిస్తున్నారు.
- గతనెలలో 127 మందిని పట్టుకున్న పోలీసులు
సిటీబ్యూరో, జూలై 3 (నమస్తే తెలంగాణ):నగరంలో మహిళలకు పోకిరీల బెడద పెరుగుతోంది. ఇటీవల కాలంలో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న కొన్ని ఘటనలతో గడపదాటి బయటకొచ్చి తిరిగి ఇల్లు చేరేవరకు ఆకతాయిల బెడదతో మనోవేదన అనుభవిస్తున్నారు. సోషల్‌మీడియా, బహిరంగ ప్రదేశాల్లో పోకిరీల వేధింపులపై గతంలో నెలకు 50 వరకు ఫిర్యాదులు వస్తే ఈ మధ్యకాలంలో ఈ ఫిర్యాదుల సంఖ్య వంద దాటుతోంది.
షీ బృందాల నిఘాతో రోజుకు ముగ్గురు నుంచి నలుగురు పట్టబడుతున్నారు. వేధింపులకు గురైన బాధితురాలు దాని నుంచి బయటపడేందుకు కనీసం మూడునెలల సమయం పడుతున్నదని షీటీమ్స్ అధికారి ఒకరు చెప్పారు. మహిళలు నగరంలో తిరగాలంటేనే భయపడిపోతున్నారు. షీటీమ్స్ ఇంతగా నిఘా పెట్టినా గత రెండేండ్లుగా పోకిరీల వేధింపుల కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. షీటీమ్స్ నిఘాలో కొన్ని ఘటనలే వెలుగుచూస్తున్నప్పటికీ మరికొందరు మహిళలు తమ సమస్య చెప్పడానికి ఇష్టపడక, బయటకు చెబితే తమ కుటుంబాలకు ఏం సమస్య వస్తుందోనంటూ భయపడుతున్నారు.
గత నెలలో 102 ఫిర్యాదులు
హైదరాబాద్ నగరవ్యాప్తంగా మహిళలు, పిల్లల రక్షణ, భద్రత లక్ష్యంగా పనిచేస్తున్న షీటీమ్స్లోని వివిధ విభాగాలకు గత నెలలో 102 ఫిర్యాదులందాయని షీటీమ్స్ డీసీపీ డాక్టర్ లావణ్య ఎన్జేపీ తెలిపారు. మరోవైపు బహిరంగప్రదేశాల్లో మహిళలను వేధించడం, దురుసుగా ప్రవర్తించిన 127 మందిని పట్టుకున్నామని, 14 కేసుల్లో నిందితులకు శిక్షలు ఖరారయ్యాయని ఆమె పేర్కొన్నారు.
సమస్యాత్మక బహిరంగప్రదేశాల్లో షీటీమ్స్ నిఘాలో భాగంగా ఈవ్‌టీజింగ్, వేధింపులపై పలు ఘటనలను గుర్తించామని, ఈ ప్రత్యేక ఆపరేషన్ల సమయంలో మహిళలను తాకుతూ, అనుచితంగా ప్రవర్తించిన ఆరుగురు వ్యక్తులను, చట్టవిరుద్ద కార్యకలాపాలకు పాల్పడుతున్న నలుగురు ట్రాన్స్జెండర్లను గుర్తించారు.
నిందితులను వెంటనే అదుపులోకి తీసుకుని వారిపై పెట్టీ కేసులు నమోదు చేశామని డీసీపీ తెలిపారు. మహిళల భద్రత, చట్టపరమైన నిబంధనలు, సైబర్ భద్రత తదితర అంశాలపై మొత్తం 1267 అవగాహన కార్యక్రమాలు చేపట్టామని ఆమె చెప్పారు. మెట్రోలు, బస్‌స్టాపులు, కాలేజీలు, ఇన్స్టిట్యూట్ల వద్ద పోకిరీల బెడద ఉంటున్న నేపథ్యంలో షీటీమ్స్ ఆయా ప్రాంతాల్లో నిఘా పెట్టి వాళ్లను పట్టుకుంటుందని డీసీపీ లావణ్య తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్‌పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
Navaratri Brahmotsavams | వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సింహ వాహనంపై యోగ నరసింహుని దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

