She team | ఆ వయసు వాళ్లే అమ్మాయిలను ఎక్కువగా వేధిస్తున్నారంట

she team | అతివలకు అభయమిస్తున్న షీటీమ్స్‌కు సెప్టెంబర్ నెలలో వివిధ వేదికల ద్వారా ఏకంగా 181 ఫిర్యాదులు వచ్చాయి. అందులో మహిళలను వేధించిన వారిలో 25-34 మధ్య వయసు వారే అధికంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ వయసు ఉన్న 58 మంది.. మహిళలు, యువతులు, విద్యార్థినులను వేధించి షీ టీమ్స్‌కు దొరికిపోయారు. సుమారు 181 ఫిర్యాదుల్లో అత్యధికంగా వాట్సాప్ ద్వారా 117లు వచ్చాయి.
వాటిపై వెంటనే స్పందించిన షీ టీమ్స్ బాధితులకు అండగా నిలిచింది. మొత్తం 40 కేసులను నమోదు చేసింది. 12 సంఘటనలపై క్రిమినల్, 28 పెట్టీ కేసులను నమోదు చేశారు. 61 మందికి వార్నింగ్ ఇచ్చి మరోసారి చేస్తే కేసులు నమోదవుతాయని హెచ్చరించారు. 122 మందికి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇక హాట్‌స్పాట్స్‌లలో షీ టీయ్స్ డెకాయ్ ఆపరేషన్స్‌ను నిర్వహించి 78 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నది. ఓ బాల్య వివాహాన్ని కూడా అడ్డుకున్నది.

మౌనంగా ఉండొద్దు..
బాధితులు ఎవరూ మౌనం ఉండకుండా షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేయాలి. డయల్ 100 లేదా సైబరాబాద్ వాట్సాప్ నంబర్ 9490617444కు లేదా నేరుగా షీ టీమ్స్‌కు కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్ వేదికల మీదుగా కూడా ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. – అనసూయ, షీటీమ్స్ డీసీపీ
గ్రీవెన్స్ సెల్ పనితీరుపై..
సైబరాబాద్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్ పనితీరుపై శుక్రవారం సీపీ స్టీఫెన్ రవీంద్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గత వారం సెల్‌కు వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై సీపీ సంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో డీసీపీలు ప్రకాశ్‌రెడ్డి, రోహిణి ప్రియదర్శిని, అనసూయ, పద్మజా, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
అమ్మ తోడు.. ఇంకోసారి అలా చేయను.. అమ్మాయిని వేధించి షీటీమ్స్ ముందు ప్రాధేయపడ్డ పోకిరీ
she team | ఆకతాయిల తాట తీశారు..
she teams | పదేపదే వేధిస్తే.. రౌడీషీట్
Bharosa & She Teams | బాలికలపై చెయ్యేస్తే చెరసాలకే..!
she teams | వేధించినా..బెదిరించినా..భరించకండి..
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

