వేధించినా..బెదిరించినా..భరించకండి..

- షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేయండి..
- సమాచారం ఇస్తే నిమిషాల్లో సేవలు
- జూలైలో 157 ఫిర్యాదులు..
- 189 పోకిరీలకు కౌన్సిలింగ్..వార్నింగ్..
యువతులు, మహిళలు తమపై జరిగే అఘాయిత్యాలు, వేధింపులు, ఇతర వెకిలి చేష్టలపై మౌనంగా ఉండొద్దు. వెంటనే షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేస్తే పోకిరీలపై కఠిన చర్యలు తీసుకుంటాం. సైబరాబాద్
పరిధిలో 11 షీటీమ్స్ బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయి. -అనసూయ, డీసీపీ
సిటీబ్యూరో, అగస్టు 19(నమస్తే తెలంగాణ): మహిళలు, యువతులను వేధించిన ఆకతాయిలపై షీ టీమ్స్ కొరడా ఝళిస్తున్నది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోకిరీల ఆగడాలపై జూలైలో 157 ఫిర్యాదులు అందగా, 11 ఘటనలపై కేసులు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. మిగతా వాటిపై పెట్టీ కేసులు పెట్టారు. మొత్తం 189 మంది ఆవారగాళ్లకు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. మరికొందరికీ మరోసారి తప్పు చేస్తే కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని వార్నింగ్‌ను ఇచ్చారు. ఎవరూ వేధించినా.. బెదిరించినా… వెంటనే షీటీమ్స్‌కు ఫిర్యాదు చేయాలని, ‘ఆమె’కు అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు.
మౌనంగా ఉండకండి.. ఇలా ఫిర్యాదు చేయండి..
సైబరాబాద్ వాట్సాప్ నం. 9490617444, బాలానగర్ షీ టీమ్స్ నం. 9490617349, ఐటీ కారిడార్-9490617352, మాదాపూర్-8333993519, కూకట్పల్లి-9493626811, జగద్గరిగుట్ట-9493624561, మియాపూర్-9491051421, పేట్‌బషీరాబాద్-790111 4137, రాజేంద్రనగర్-7901114140, శంషాబాద్-9490617354, చేవెళ్ల-9493625379, షాద్‌నగర్-9493624147 లేదా డయల్ 100 లేదా sheteam.cyberabad< \@>gmail. com, twitter-<\@>sheteamcybd, facebook.com wogman & childrensafety win, instagram.com womenandchildrensafetywingcybd నుంచి షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేయవచ్చు. సహాయాన్ని కోరవచ్చు. బస్సు స్టాప్‌లు, మెట్రో స్టేషన్లు, షాపింగ్ మాల్స్, హాట్ స్పాట్స్లతో పాటు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేసి.. వాటిలో లొకేషన్, ఫోన్ నంబర్ పెట్టినా షీ టీమ్స్ మీరు ఆపదలో ఉన్న స్పాట్‌కు చేరుకుని మిమ్మల్ని రక్షిస్తాయి. ఫిర్యాదు నమోదు చేసినా యాక్షన్ తీసుకుంటారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- She Teams
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

