శంషాబాద్ రూరల్: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న శంషాబాద్‌ను సైబరాబాద్ పరిధిలోనే ఉండనివ్వాలని ఆ ప్రాంత బీఆర్ఎస్ నాయకలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం శంషాబాద్‌ను హైదరాబాద్ కార్పొరేషన్లో విలీనం చేస్తూ.. జీవో నం. 55 తేవడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు బీఆర్ఎస్ నాయకులు శంషాబాద్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుమన్‌రావును కలిసి శంషాబాద్‌ను సైబరాబాద్‌లోనే ఉండనివ్వలని వినతి పత్రం అందజేశారు. అనంతరం శంషాబాద్‌లో బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ శంషాబాద్ జోన్‌ను హైదరాబాద్‌లో విలీనం చేస్తే.. అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందన్నారు. శ్రీనివాస్, రాజేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.