Shamshabad | శంషాబాద్ రూరల్, జూన్ 9: హైదరాబాద్ శివారు శంషాబాద్ మున్సిపాలిటీలోని కాముని చెరువులో పెరిగిన గుర్రపు డెక్కను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. కాలుష్య నివారణకు ఏర్పాటు చేసిన వంద రోజుల ప్రణాళికలో భాగంగా శంషాబాద్ మున్సిపల్ కమిషనర్ సుమన్‌రావు ఆధ్వర్యంలో సోమవారం నాడు గుర్రపు డెక్క తొలగింపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా మున్సిపల్ జాయింట్ డైరెక్టర్ సంధ్య మాట్లాడుతూ.. కాలుష్య నివారణ కోసం వందరోజుల ప్రణాళిక ఏర్పాటు చేశామని తెలిపారు. అందులో భాగంగానే కాముని చెరువులో పెరుగుతున్న గుర్రపు డెక్కను పూర్తిగా తొలగిస్తామని పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో గుర్రపు డెక్కను తొలగించి కాముని చెరువులో నీరు కలుషితం కాకుండా చూస్తామని చెప్పారు.