శంషాబాద్ రూరల్, జనవరి 21: ముందుగా వెళ్తున్న కారును వెనుక నుంచి వచ్చిన సీఎంఆర్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న సంఘటన మంగళవారం శంషాబాద్‌రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ నరేందర్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిలో మండలంలోని తొండుపల్లి వద్ద ముందుగా వెళ్తున్న కారును వెనుక నుంచి సీఎంఆర్ ట్రావెల్స్ బస్సు నంబర్ బస్సు ఢీకొవడంతో కారుపూర్తిగా దెబ్బతిన్నట్లు తెలిపారు.
కారు డ్రైవర్ అభిషేక్‌కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం శంషాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. ఇదిలా ఉండగా.. కారు డ్రైవర్ అభిషేక్ హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలికి చెందిన దేవరకొండ ప్రవీణ్‌రెడ్డి కుటుంబ సభ్యులను ఎయిర్‌పోర్టులో దింపి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు వివరించారు. ఈ ప్రమాదంపై ప్రవీణ్‌రెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.