సిటీబ్యూరో, నవంబర్ 7, (నమస్తే తెలంగాణ): తెలంగాణ శాసన మండలి సభ్యుడు శంభీపూర్ రాజు మొబైల్ ఫోన్ను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. దీంతో ఆయన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతికి ఫిర్యాదు చేశారు. ఫోన్ హ్యాకింగ్ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి, బాధ్యులైన వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రజాప్రతినిధుల కమ్యూనికేషన్ పరికరాలను లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న ఇలాంటి సైబర్దాడులతో ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదమని శంభీపూర్ రాజు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు అపోహలు రాకుండా, తన ఫోన్ ద్వారా ఎవరికైనా తప్పుడు సందేశాలు, ఫోన్ కాల్స్ చేస్తే అలాంటివి నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా దుండిగల్ పోలీస్ స్టేషన్లోనూ ఎమ్మెల్సీ తన ఫోన్ హ్యాక్ విషయమై ఫిర్యాదు చేశారు.