పైలెట్ శిక్షణ తీసుకుంటున్న యువతిపై లైంగిక దాడి
పైలెట్ శిక్షణ తీసుకుంటున్న ఓ యువతిపై ఇన్స్ట్రక్టర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. బేగంపేట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన యువతి(20) బేగంపేట్‌లోని ఓ పైలెట్ ట్రేనింగ్ కేంద్రంలో శిక్షణ కోసం 2025లో చేరింది. ఆ సమయంలో అక్కడ ఇన్‌స్ట్రక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న కేరళ రాష్ట్రం కొట్టాయంకు చెందిన నసీముద్దీన్ అలియాస్ నసీం(30)తో పాటు సల్మాన్ సలీం(45)లతో ఆమెకు పరిచయం ఏర్పడింది.
బేగంపేట్, ఏప్రిల్ 8: పైలెట్ శిక్షణ తీసుకుంటున్న ఓ యువతిపై ఇన్స్ట్రక్టర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. బేగంపేట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన యువతి(20) బేగంపేట్‌లోని ఓ పైలెట్ ట్రేనింగ్ కేంద్రంలో శిక్షణ కోసం 2025లో చేరింది. ఆ సమయంలో అక్కడ ఇన్‌స్ట్రక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న కేరళ రాష్ట్రం కొట్టాయంకు చెందిన నసీముద్దీన్ అలియాస్ నసీం(30)తో పాటు సల్మాన్ సలీం(45)లతో ఆమెకు పరిచయం ఏర్పడింది. నసీముద్దీన్ తనను ఒక సోదరుడిగా, సల్మాన్ సలీం ఒక తండ్రిగా ఆ యువతి భావించింది. వారితో సన్నిహితంగా మెలుగుతూ వచ్చింది.
ఈ చనువుతో బేగంపేట్ బ్రాహ్మణవాడిలో ఉండే నసీముద్దీన్ వద్దకు చదుపుకోవడానికి తరచూ వెళ్లేది. ఈ క్రమంలో గతేడాది డిసెంబర్ 27న సాయంత్రం ఆమె నసీముద్దీన్ వద్దకు వెళ్లింది. కాగా, నసీముద్దీన్ ఫుట్‌బాల్ మ్యాచ్‌కు వెళ్లి తిరిగి అర్ధరాత్రి 12గంటలకు వచ్చాడు. అప్పటి వరకు ఆ యువతి అక్కడే చదువుతూ ఉంది. అతడు రాగానే తాను తన స్నేహితురాలి వద్దకు వెళ్తానని చెప్పడంతో వద్దు ఇక్కడే ఉండాలి అని పట్టుపట్టాడు. తన జీవితం గురించి చెబు తూ.. అసభ్యకరంగా ప్రవర్తించాడు.
బాధితురాలు అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించగా, లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెబితే పరువు తీస్తానని, కుటుంబానికి హాని కలిగిస్తానని బెదిరించాడు. అనంతరం ఆ తర్వాత చదువు కోసం దమ్మాయిగూడలో ఉంటున్న మరో ఇన్స్ట్రక్టర్ సల్మాన్ ఇంటికి వెళ్తుండేది. నసీముద్దీన్ అక్కడికి మకాం మార్చి అక్కడ కూడా బెదిరించడం మొదలుపెట్టాడు. వేధింపులు అధికమవ్వడంతో బాధితురాలు బేగంపేట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నసీముద్దీన్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

