సిటీబ్యూరో, అక్టోబర్ 23(నమస్తే తెలంగాణ): బంజారాహిల్స్‌లో సెక్స్‌రాకెట్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు భగ్నం చేశారు. వివరాల్లోకి వోళ్తే..బంజారాహిల్స్ రోడ్‌నంబర్-12లోని ఆర్ఇన్ హోటల్లో సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లు అందిన సమాచారం మేరకు గురువారం వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆ హోటల్‌పై దాడి చేశారు. నిర్వాహకుడు షరీఫ్‌తోపాటు కర్నూల్కుచెందిన ఏడుగురు విటులను అరెస్ట్ చేసి.. ముగ్గురు యువతులను రక్షించారు.
ఇందులో ఒకరు ఉజ్బెకిస్తాన్‌కు చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు. వారిని బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌కు అప్పగించారు. గతంలో ైైస్టెల్ మేకర్ సెలూన్ నడిపిన ఎండీ షరీఫ్.. మంచి జీతం, కమీషన్లు ఇస్తామంటూ నమ్మించి యువతులను తీసుకువచ్చి వ్యభిచారంలోకి దింపారని పోలీసులు తెలిపారు. ఈ దాడులను అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఇక్బాల్ సిద్ధిఖి పర్యవేక్షించగా వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ యాదేందర్, ఎస్ఐ రవిరాజ్ పాల్గొన్నారు.