బండ్లగూడ, ఏప్రిల్ 3: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని అత్తాపూర్లో ఏడేండ్ల బాలుడి హత్య (Murder) కలకలం రేపుతున్నది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోల్డెన్ సిటీలో బాలుడి తలపై రాళ్లతో కొట్టి చంపేసిన దుండగులు.. మృతదేహాన్ని మీరాలం ట్యాంక్ సమీపంలో పడేశారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడు ఎవరనే కోణంలో విచారణ చేస్తున్నారు. హైదరాబాద్లోని పలు పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ కేసుల వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.