మారేడ్‌పల్లి (హైదరాబాద్) : ఎలాంటి స్వలాభం ఆశించకుండా అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న బ్రహ్మకుమారీల ( Brahmakumaris ) సేవలు ఎంతో విలువైనవని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(Ex-minister Thalasani ) అన్నారు. ఆదివారం మోండా డివిజన్ సెకండ్‌బజార్‌లో నూతనంగా నిర్మించిన బ్రహ్మకుమారీల శాంతి భవన్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం సిఖ్‌విలేజ్ లోని ఇంపిరియల్ గార్డెన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు.
నిత్యం అనేక పనులతో తీవ్ర ఒత్తిడులకు లోనయ్యే వారు రోజులో కొద్ది సమయం బ్రహ్మకుమారీస్ కార్యక్రమాల్లో పాల్గొంటే ఎంతో ఉపశమనం పొందుతారని తెలిపారు. భగవంతుడికి, భక్తుడికి మద్య అనుసంధానంగా బ్రహ్మకుమారీలు వ్యవహరిస్తున్నారని, వారి జన్మ ఎంతో ధన్యమవుతుందని అన్నారు.
బ్రహ్మకుమారీలఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలకు తన వంతు సహాయ, సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని తెలిపారు. దేశ విదేశాల్లోనూ లక్షలాది మందికి విశేషమైన సేవలు అందిస్తూ మన్ననలను పొందుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో రిటైర్డు జడ్జి ఈశ్వరయ్య, రాజయోగిని బికె. సంతోష్ దీదీ, రాజ్యోగిని బికె. కులదీప్, సరోజని, నితిన్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.