అంబర్ పేట : నల్లకుంట డివిజన్‌కు చెందిన పారిశుద్ధ్య కార్మికులకు కార్పొరేటర్ వై అమృత బుధవారం భద్రత కిట్లను పంపిణీ చేశారు. ప్రభుత్వం అందజేస్తున్న ఈ కిట్లను జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు.
వర్షాకాలంలో కార్మికులకు ఈ కిట్లు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్ వాసుదేవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.