బేగంపేట్ మార్చి 9 ; లుంబినీ పార్కులో బోటును శుభ్రం చేస్తూ సెక్యూరిటీ గార్డు ప్రమాదవశాత్తు నీటిపడి మృతి చెందాడు. ఈ ఘటన లేక్ సెక్రటరీయేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యూనల్లకుంటకు చెందిన సూరారం యాదగిరి గత ఐదేళ్ల నుంచి లుంబినీ పార్కులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు.
శనివారం సాయంత్రం బోటును శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు హుస్సేన్‌సాగర్ నీటిలో పడిపోయాడు. పార్కు సిబ్బంది సీసీ కెమెరాలను పరిశీలించగా నీళ్లలో పడిపోయినట్లు గుర్తించారు. ఆదివారం సాయంత్రం హుస్సేన్ సాగర్ నీటిలో మృతదేహం తేలియాడుతుండగా లేక్ పోలీసులు వెలికితీశారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసికున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.