బొల్లారం, ఫిబ్రవరి 27: సైన్స్ ప్రాధాన్యతను నేటి అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకుంటూ, ప్రపంచ సవాళ్లను తగ్గించడంలో, మానవ సంక్షేమానికి భరోసా ఇవ్వడంతో పాటు శాస్త్రీయ జ్ఞానాన్ని విస్తృతం చేయాలని సీసీఎంబీ మాజీ డైరెక్టర్ సీహెచ్ మోహన్ రావు అన్నారు. బొల్లారం రాష్ట్రపతి నిలయంలో గురువారం జాతీయ సైన్స్ వేడుకలను నిలయం అధికారులతో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీసీఎంబీ మాజీ డైరెక్టర్ మోహన్ రావు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఐసీఎంఆర్) మాజీ డైరెక్టర్ శశికిరణ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా డాక్టర్ మోహన్ రావు స్పెక్టోస్క్రోపీ దాని రంగంలో ప్రాముఖ్యతను వివరించారు. అంతర్ దృష్టిలో సర్ సీవీ రామన్ కాంతి అణువులు, రామన్ ఎఫెక్ట్ ఫలితంగా అణువుల ద్వారా కాంతిని వెదజల్లడం వంటి ఆవశ్యకతను వివరించారు. అనంతరం, ఐసీఎంఆర్ మాజీ డైరెక్టర్ శశి కిరణ్ సైన్స్ పై దృష్టి సారిస్తూ అనేక ఆరోగ్య విషయాలను వివరించారు. సరైన తయారీ పోషక విలువలను సంరక్షించడంతో పాటు అనారోగ్యకరమైన ప్రమాదాలను ఎలా నివారించుకోవచ్చు వెల్లడించారు. అదే విధంగా పేద వర్గాల్లో ప్రారంభ దశలో గుండెపోటుల పెరుగుదలను ప్రస్తావించారు. దీనికి పేద తల్లి పోషకాహారం, తక్కువ జనన బరువు కారణమని పేర్కొన్నారు. ఆహారపు అలవాట్లతో పాటు జీవన శైలిని మార్చు కోవాలని సూచించారు.
వేడుకల్లో పలు ప్రదర్శనలు…
సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్(సీడీఏఏఎఫ్ ఢీ), నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ( ఎన్ఆర్ఎస్సీ), సీఎస్ ఐఆర్ -సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ), సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్ఐఎన్) , నేషనల్ జియోఫినికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఎన్జీఆర్ఐ) సంస్థలు తమ పరిశోధన, అభివృద్ధి ఆవిష్కరణలను ప్రదర్శించడానికి స్టాల్స్ ఏర్పాటు చేశాయి. అదే విధంగా జన విజ్ఞాన వేదిక, డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ విజ్ఞాన, సాంకేతికత, వారసత్వంపై పుస్తక ప్రదర్శన నిర్వహించారు.
భారతదేశంలోని శాస్తజ్ఞ్రుల ఫొటో ప్రదర్శన, ప్రముఖ శాస్తవ్రేత్తల అకాడమిక్స్, ఇన్నోవేటర్స్ ఆధ్వర్యంలో విజ్ఞానంలో పురోగతి, శాస్త్రంతో సరదా, సైన్సును అవగతం చేసుకోవడంతో పాటు కెరీర్లు అంతరిక్ష అన్వేషణ, శాస్త్రంలో ఆవిష్కరణలు వంటి విభిన్న ఆసక్తికర అంశాలను ఉద్దేశించి వర్క్ షాపులు ఏర్పాటు చేశారు. ఈ మేరకు నిలయం అధికారిని రజినీ ప్రియ మాట్లాడుతూ, క్విజ్, సైన్స్ మోడల్ ఎగ్జిబిషన్లు, పోస్టర్ మేకింగ్ వంటి పోటీలు నిర్వహించామని ఈ వేడుకలను గురువారం ఒక్కరోజే సుమారు 2,700 మంది విద్యార్థులు సందర్శించినట్లుగా పేర్కొన్నారు.