బాలానగర్/అల్వాల్: యూనిఫాం వేసుకురాలేదని ఓ విద్యార్థిని ఓ ప్రైవేటు స్కూల్ యాజమాన్యం బయట నిలబెట్టడం ఉద్రిక్తతకు దారితీసింది. ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్ పరిధి హస్మత్‌పేట అంజయ్యనగర్‌లోని శ్రీ దర్శన్ స్కూల్లో సోమవారం ఉదయం ఒకటో తరగతి చదివే కృత్విక్ కాలుకు గాయం కావడంతో స్కూల్‌కు యూనిఫాం లేకుండా వెళ్లాడు.
గమనించిన ప్రిన్సిపాల్ మానస యూనిఫాం ఎందుకు వేసుకోలేదని బెదిరిస్తూ.. గంట పాటు పాఠశాల బయటే నిలబెట్టారు. అంతేకాకుండా కృత్విక్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి పాఠశాలకు వెంటనే రావాలని ఆదేశించారు. వెంటనే వారు పాఠశాలకు చేరుకొని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తుండగా, ప్రిన్సిపాల్ మానస, మిగతా ఎటు చూసినా చెత్తకుప్పలే.. గమనార్హం. ఈ నేపథ్యంలోనే చాలా చోట్ల రోడ్ల పక్క చెత్తి ఎత్తిన అనంతరం కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లడం లేదు. గతంతో పోలిస్తే బహిరంగ ప్రదేశాల్లో చెత్త కుప్పలు ఎక్కువగా కనిపిస్తున్నాయని స్వయంగా అధికారులే చెబుతుండడం గమనార్హం.
ఇంటింటి చెత్త సేకరణ లక్ష్యం అమలు కావడం లేదు. గ్రేటర్లో చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా దాదాపు మూడున్నరేళ్ల కిందట డస్ట్ బిన్ లెస్ సిటీ పేరుతో చెత్త కుండీలను జీహెచ్ఎంసీ ఎత్తేసింది. మెరుగైన పారిశుధ్య నిర్వహణకు పకడ్బందీ చేస్తూ వందకు వంద శాతం ఇంటింటి చెత్త సేకరణకు స్వచ్ఛ ఆటోల సంఖ్యను పెంచారు. సుమారు 5,250 స్వచ్ఛ ఆటోలు గతంలో ఉండగా..ప్రస్తుతం 4,500 మాత్రమే ఉన్నాయి. వీటిని 4,846 కాలనీల్లో 23 లక్షల గృహాల నుంచి రోజుకు 7,757ల మెట్రిక్ టన్నులకు పైగా చెత్త సేకరణ జరగాలి.
ఒకొక ఆటోకు కాలనీ వారీగా చూస్తే ఒకటి లేదా రెండు కాలనీలు గృహాల ప్రకారంగా గమనిస్తే ఒకొక అటోకు సుమారు 500 నుంచి 600 ఇళ్లను కేటాయించి, చెత్త సేకరణ జరపాలి. కానీ గడిచిన కొన్ని రోజులుగా స్వచ్ఛ ఆటోల పనితీరు సరిగా ఉండడం లేదు. చాలా కాలనీలకు రోజూ స్వచ్ఛ ఆటోలు రావడం లేదు. వందకు వంద శాతం స్వచ్ఛ ఆటోల అటెండెన్స్ ఉండడం లేదు. చాలా ప్రాంతాల్లోకి స్వచ్ఛ ఆటోలు రావడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఆటోలు టైమ్‌కు రాకపోవడంతో తప్పని పరిస్థితుల్లో రోడ్ల వెంట పోస్తున్నామని గృహిణులు చెబుతున్నారు.