హైదరాబాద్: హైదరాబాద్‌లోని షేక్‌పేటలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మంగళవారం ఉదయం షేక్‌పేట పరిధిలోని ఫిలింనగర్లో వేగంగా దూసుకొచ్చిన లారి ముందు వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో పదేండ్ల బాలిక అక్కడికక్కడే మృతిచెందింది. గడ్డం హేమ సుందర్ అనే వ్యక్తి ఐదో తరగతి చదువుతున్న తన కుమార్తె అథర్విని స్కూల్లో వదిలేందుకు బైక్‌పై వెళ్తున్నారు. ఫిలింనగర్ వద్ద ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపుతప్పిన లారీ.. వీరి బైక్‌ను బలంగా గుద్దింది. దీంతో లారీ వెనుక చక్రాల కింద పడిన బాలిక అక్కడికక్కడే మరణించింది. తండ్రి సుందర్ గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. అతడు ఓ ప్రముఖ న్యూస్ చానల్ డిజిటల్ హెడ్‌గా పనిచేస్తున్నారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆరాంఘర్ ఫ్లైఓవర్‌పై..
మితిమీరిన వేగం, నిర్లక్ష్యానికి ముగ్గురు యువకులు బలయ్యారు. రాజేంద్రనగర్‌లోని శివరాంపల్లి వద్ద ఆరాంఘర్ ఫ్లైఓవర్‌పై (Aramghar Flyover) ఓ బైక్ డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు దవాఖానలో ప్రాణాలు కోల్పోయారు. మృతులను బహదూర్‌పురా, తలాబ్‌కట్టకు చెందినవారిగా గుర్తించారు.
మంగళవారం తెల్లవారుజామున బహదూర్‌పురాకు చెందిన అహ్మద్, మాజ్ ఖాద్రి, తలాబ్‌కట్టకు చెందిన సయీద్ అనే ముగ్గురు ఆరాంఘర్ ఫ్లైఓవర్‌పై బహదూర్‌పురా నుంచి ఆరాంఘర్ వైపు ఒకే స్కూటర్‌పై వెళ్తున్నారు. స్టంట్లు చేస్తూ అతివేగంతో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో శివరాంపల్లి సమీపంలోకి రాగానే అదుపుతప్పి ఫ్లైఓవర్‌పై ఎలక్ట్రిక్ పోల్‌ను ఢీకొట్టింది. అనంతరం అది డివైడర్ వైపు దూసుకెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడంతో ఇద్దరు ఘటనా స్థలంలో మరణించారు. మరొకరు హాస్పిటల్లో చనిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులు మైనర్లని వెల్లడించారు.