సుల్తాన్‌బజార్, డిసెంబర్ 14 : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) హోంలోన్ మార్కెట్లో అగ్రగా మిగా నిలిచిందని హైద రాబాద్ సర్కిల్ సీజీఎం అమిత్ జింగ్రాన్ అన్నా రు. ఈ మేరకు కోఠిలోని ఎస్బీఐ ప్రధాన కార్యా లయ ఆవరణలో ఈనెల 17,18వ తేదీల్లో హైటెక్స్ ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహిస్తున్న మెగా హోంలోన్ ప్రాపర్టీ షో ప్రచార రథాలను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆవరణలోని గోల్డెన్ జూబ్లీ సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత మార్కెట్ ఇతర బ్యాంకులతో పోల్చితే ఎస్బీఐ హోంలోన్‌లో మొదటి చాయిస్‌గా నిలిచిందన్నారు.
హైదరాబాద్ సర్కిల్లో రూ.8700 కోట్లను పంపిణీ చేశామనడానికి గర్వంగా ఉందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ సర్కిల్లో 50వేల కోట్ల హోంలోన్లను, తెలంగాణ రాష్ట్రంలో 21714 హోం లోన్స్లను, 1200 కోట్ల టాప్ అప్ లోన్లను మంజూరు చేశామన్నారు. ఈ ఏడాది మార్చి వరకు సబ్సిడీ కింద 373 కోట్లను మంజూరు చేశామని, గత ఏడాది బ్యాంకు ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ప్రాపర్టీ షో విజయవంతమైందన్నారు. ఈ ఏడాది కూడా రెండు రోజులపాటు ఎస్బీఐ మెగా హోంలోన్ ప్రాపర్టీషోను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ ప్రాపర్టీ షోలో నగరానికి చెందిన 70 మంది అతిపెద్ద బిల్డర్లు 300కు పైగా తమ ప్రాజెక్ట్‌లను ఆవిష్కరిస్తారన్నారు. నగర వాసుల డ్రీమ్ హౌజ్ కలలను నెరవేర్చుకునేందుకు ఈ ప్రాపర్టీ షో ఒక వేదిక కానుందన్నారు. ఈ సమావేశంలో ఎస్బీఐ నెట్వర్క్-1జీఎం మంజు శర్మ, సీసీజీ ఆర్వో జీఎం జి.రమేశ్, రియల్ ఎస్టేట్ డీజీఎం రవీంద్ర హెట్నాలి, సికింద్రాబాద్ డీజీఎం బాలానంద్, సైబరాబాద్ డీజీఎం శ్రీరామ్ సింగ్, హైదరాబాద్ డీజీఎం సత్యనారాయణ పాణిగ్రహితోపాటు ఇతర బ్యాంకు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.