బజార్ హత్నూర్ : బజార్ హత్నూర్ మండల కేంద్రం లో ఎస్బీఐ బ్యాంకుని ఏర్పాటు చేయాలని సోమవారం ప్రజావాణిలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆధ్వర్యంలో కొనసాగిన ప్రజావాణిలో లీడ్ బ్యాంకు మేనేజర్ (LDM)ను కలిసి బజార్ హత్నూర్ మండల ప్రజలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. బజార్ హత్నూర్ మండలంలో నూతనంగా ఎస్బీఐ బ్యాంకు మంజూరు చెయ్యాలని నిత్యం ఖాతాదారులు పెరుగడంతో పాటు సరైన బ్యాంకు సేవలు అందిచడంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు విఫలం కావడంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదురుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.
అంతే కాకుండా ఇచ్చోడ, బోథ్, ఆదిలాబాద్ వంటి పట్టణాల్లో ఉన్న ఎస్బీఐతో పాటు ఇతర బ్యాంకు సేవలను మండల ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. దీంతో దూర భారంతో ఇబ్బందులు తప్పడం లేదన్నారు. అదే బజార్ హత్నూర్ మండల కేంద్రంలో బ్యాంకు ఉంటే ప్రజలకు అన్నివిధాలుగా సౌకర్యంగా ఉంటుంది అని పేర్కొన్నారు. దీంతో సానుకూలంగా స్పందించిన LDM విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పరచ సాయన్న, లక్కం శంకర్, డబ్బులు చంద్ర శేఖర్, బత్తిని మురళి కృష్ణ, సచిన్ తదితరులు పాల్గొన్నారు.