పౌర్ణమి సందర్భంగా ఓల్డ్ అల్వాల్‌లోని జొన్నబండ ఉమామహేశ్వరస్వామి దేవాలయంలో సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించారు. ఆంజనేయస్వామికి ప్రత్యేక అష్టోత్తర శత గో క్షీరాభిషేకం (108 లీటర్ల ఆవు పాలు ), పంచామృత, చందనాభిషేకం, సహస్ర నాగవల్లి పత్రి పూజ చేశారు. మధ్యాహ్నం ఆలయ ఆవరణలో ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్టు ఆలయ కమిటీ చైర్మన్ కొడారి నర్సింగరావు, ప్రధాన అర్చకుడు విరివెంటి రాజశేఖర్ శర్మ తెలిపారు.