Saree Run | ఖైరతాబాద్: భారత్‌లో మహిళలు ధరించే చీరల ఔనత్యాన్ని చాటుతూ మహిళామణులు చీరకట్టి పరుగులు పెట్టారు. ఆదివారం నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా వేదికగా తనైరా..జేజే యాక్టివ్ సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన సెకండ్ ఎడిషన్ శారీ రన్ విశేషంగా ఆకట్టుకున్నది. సుమారు 3వేల మంది మహిళలు సంప్రదాయ చేనేత చీరలను ధరించి రన్లో పాల్గొన్నారు.
చీరలు కట్టి గృహిణులుగానే కాదు…. ఫిట్‌నెస్‌లోనూ తాము ఎల్లప్పుడూ ముందుంటామని చాటారు. 2020లో ప్రారంభించిన శారీ రన్ బెంగళూరు, కోల్‌కతా, పుణెలో నిర్వహించామని, రెండో ఎడిషన్ నగరంలో ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. ప్రముఖ సామాజిక సేవకురాలు, గుర్తింపు ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు వసుంధర కొప్పులతో పాటు సీనియర్ వైద్యురాలు డాక్టర్ జయంతి వంటి ఎందరో ప్రముఖులు ఈ రన్లో పాల్గొని స్ఫూర్తిని చాటారు. పురుషులతో సమానంగా మేము సైతమంటూ బుల్లెట్ బండి ఎక్కి చక్కర్లు కొడుతూ..సందడి చేశారు.