Muchintal | శంషాబాద్ రూరల్ : ముచ్చింతల్‌లో సమతామూర్తి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో ఐదోరోజైన శుక్రవారం గద్యత్రయ పారాయణం శ్రీరామానుజులు మనకు తొమ్మిది సూక్తులను గాద్యత్రయ అనే త్రిగుణ గద్యాన్ని అనుగ్రహించాలని చిన్నజీయర్‌స్వామి పిలుపునిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న సీబీఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రామానుజులు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని వివరించారు. కుల వ్యవస్థను వ్యతిరేకించారన్నారు. అందరికి ఈక్వాలిటీ తీసుకురావాలని రామానుజులు గురువుల్లో అబ్రహ్మాణులు కూడా ఉన్నారని చెప్పారు. రామానుజుల వారు 120 ఏండ్ల జీవితంలో ఎన్నో ప్రాంతాలు తిరిగి దళితులకు ఆలయ ప్రవేశం చేయించారని గుర్తు చేశారు. ఇతర మతస్తులను కూడా దగ్గరికి తీసిన మహానుభావుడు రామానుజులవారని వివరించారు. దళితులను భుజాలపైకి ఎక్కించుకుని ఆలయంలోకి తీసుకెళారని.. దానినే మునివాహన సేవ అంటారని వివరించారు.