అమీర్‌పేట, ఏప్రిల్ 21 : వ్యాపార, పారిశ్రామిక అవసరాలకు సంబంధించిన గ్యాస్ వినియోగంలో భద్రతాంశాలకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నీలోఫర్ అధినేత బాబురావు పేర్కొన్నారు. గ్యాస్ వినియోగంలో భద్రతకు సంబంధించి పుణే గ్యాస్ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చిన ఆధునిక విధానమైన పుణే గ్యాస్ ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను బాబురావు సోమవారం బల్కంపేటలో ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పూర్తిస్థాయిలో గ్యాస్‌ను సురక్షితమైన పద్ధతిలో వినియోగించుకోవడం పుణే గ్యాస్ ప్రత్యేకత అని అన్నారు.
పర్యావరణ అనుకూలమైన పుణే గ్యాస్ విధానాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించేందుకు సంస్థ ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని పుణే గ్యాస్ సీఈవో జెసెల్ సంపత్ పేర్కొన్నారు. ఇప్పటికే బ్రాడ్ వే వంటి అనేక సంస్థలు పుణే గ్యాస్ విధానాన్ని ఆచరిస్తున్నాయని తెలిపారు. పుణే గ్యాస్ విధానాన్ని నెలకొల్పడంతో పాటు నిర్వహణ పద్ధతులకు సంబంధించి కస్టమర్లకు పూర్తి అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన సేవలను కూడా సంస్థ అందిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పుణే గ్యాస్ హైదరాబాద్ డైరెక్టర్ వినయ్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.