బడంగ్‌పేట: గ్రామాల్లో ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సిరిగిరిపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన పలువురు నాయకులు సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహేశ్వరి నియోజకవర్గానికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ రెడ్డి, మహేశ్వరం మండల బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు శ్రీను తదితరులు పాల్గొన్నారు.