ఆర్కే పురం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఫల్యంతోనే నగరంలో మంచినీటి సమస్య ఏర్పడిందని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆర్కే పురం డివిజన్ ఎన్టీఆర్ నగర్ పేస్- 3 లో మంచినీటి సమస్య ఉందని తెలుసుకున్న ఎమ్మెల్యే బుధవారం జలమండలి, బల్దియా అధికారులు, స్థానిక నాయకులతో కలిసి పర్యటించి స్థానికులను నీటి సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ నిరంతరంగా నీరందించారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 3 నెలలుగా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడిందన్నారు. మహానగరంలో ఏ వీధిలోకి వెళ్ళిన ప్రజలు నీటి సమస్య గురించి ప్రస్తావిస్తున్నారని తెలిపారు. నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ, డివిజన్ అధ్యక్షుడు నగేశ్, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీమన్నారాయణ, తదితరులు పాల్గొన్నారు.