మేడ్చల్, డిసెంబర్27(నమస్తే తెలంగాణ): నేటి నుంచి రైతుబంధు పెట్టబడి సాయం రైతుల ఖాతాలలో జమ కానుంది. యాసంగి పంటకు సంబంధించి ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించనుంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 34,474 మంది రైతులకు రూ. 33.73 కోట్లను రైతుబంధు పథకం ద్వారా అందిస్తున్నారు. యాసంగిలో నూతనంగా 2,651 మంది రైతులకు రైతు బంధు పథకం అందనుంది. గత వానకాలం(ఖరీఫ్)లో రైతుబంధు పథకంలో 32,601 మంది రైతులకు రూ.33.61 కోట్లను జమ చేసిన విషయం విదితమే. యాసంగి సీజన్లో రైతుబంధు పథకం నగదును జమ చేయనున్న నేపథ్యంలో వ్యవసాయ పనులలో నిమగ్నం అయ్యేందుకు రైతన్నలు సిద్ధమవుతున్నారు.