వ్యవసాయ యూనివర్సిటీ, డిసెంబర్ 13 : గ్రామీణాభివృద్ధి కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇవ్వడం హర్షనీయమని ఎన్ఐఆర్డీ పీఆర్ డైరెక్టర్ జనరల్ డా. నరేంద్రకుమార్ అన్నారు. బుధవారం రాజేంద్రనగర్ ఎన్ఐఆర్డీ పీఆర్డి సమావేశపు మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్, జీబీ పంత్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ ఎన్విరాన్మెంట్ బృందం ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు ఎంవోయూపై సంతకం చేశారు. ఎన్ఐఆర్డీపీఆర్ రిజిస్ట్రార్ మనోజ్‌కుమార్, సహజ వనరుల నిర్వహణ, వాతావరణ మార్పు, విపత్తు నిర్వహణ కేంద్రం హెడ్ డా. రవీంద్రగావలి, డా. కేశవరావు, డా. కతిరేసన్ , ఎన్ఐహెచ్ఈ డైరెక్టర్ సునిల్నౌటియాల్, జగదీశ్ చంద్ర తదితరులు పాల్గొని సుదీర్ఘ చర్చ జరిపారు. వ్యవసాయ ఆధారిత జీవనోపాధి వ్యూహాలు, తదితర అంశాలపై చర్చించారు. దేశ అభివృద్ధిలో గ్రామీణ ప్రాంతాలదే కీలక పాత్ర అని, పల్లెలు అభివృద్ధి జరిగితేనే దేశ అభివృద్ధి అని సూచించారు. ప్రధానంగా వ్యవసాయ, అనుబంధ రంగాలను వీలైనంత వరకు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.