హైదరాబాద్: దేశవ్యాప్తంగా మహాశివరాత్రి(Shivratri) పర్వదినాన్ని ప్రజలు అత్యంత భక్తితో జరుపుకుంటున్నారు. అన్ని శైవాలయాల్లో ఇవాళ ఉదయం నుంచి ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని పంజాగుట్టలో ఉన్న దుర్గా భవానీ ఆలయంలో.. దుర్గమల్లేశ్వర స్వామికి రుద్రాభిషేకం నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు అభిషేకంలో పాల్గొన్నారు.
హర హర శంభో.. శివ శివ శంభో అంటూ భక్తులు శివలింగానికి అభిషేకం నిర్వహించారు. మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ.. రుద్రపాఠనం నిర్వహించారు. ఇవాళ రాత్రి శివపార్వతుల కళ్యాణం నిర్వహించనున్నారు.
ఓం నమ శివాయ అంటూ భక్తులు పరవశంతో పలికారు. దుర్గామల్లేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు.