హైదరాబాద్: శైవాలయాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. మహాశివరాత్రి (Maha Shivaratri)పర్వదినాన్ని పురస్కరించుకున్న ఇవాళ శివాలయాల్లో ఘనంగా అభిషేకాలు, పూజలు జరుగుతున్నాయి. హైదరాబాద్లోని పంజాగుట్టలో ఉన్న శ్రీ దుర్గ భవాని దేవాలయంలో(Durga Bhavani Temple) కూడా ఇవాళ ఉదయం ఘనంగా రుద్రాభిషేకం(Rudrabhishekam) నిర్వహించారు.
#Mahashivratri హైదరాబాద్లోని పంజాగుట్ట దుర్గా భవాని దేవాలయంలో ఇవాళ ఘనంగా రుద్రాభిషేకం నిర్వహించారు. మహాశివరాత్రి వేడుకల్ని ఆలయంలో వైభవంగా నిర్వహిస్తున్నారు. pic.twitter.com/rlbwg4FnXP
— Namasthe Telangana (@ntdailyonline) February 18, 2023
ఆలయ పూజారి ప్రసాద్ ఆధ్వర్యంలో రుద్రాభిషేకం జరిగింది. పాలు, తేనే, నెయ్యి.. పంచ ద్రవ్యాలతో మహాశివుడికి అభిషేకం చేశారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఇవాళ ఉదయం నుంచే ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. శంభోహర హర అంటూ భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఆలయంలో ఉన్న శివ విగ్రహాలకు తన్మయత్వంతో అభిషేకాలు నిర్వహించారు.