సుల్తాన్‌బజార్, సెప్టెంబర్ 15: ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమయ్యే ప్రక్రియలో తుది అంకం ఆమోదం పొందడాన్ని హర్షిస్తూ శుక్రవారం గౌలిగూడ హైదరాబాద్ డిపో-1లో సిబ్బంది సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
ఆర్టీసీ ఉద్యోగుల చిరకాల కోరికను నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని టీఎస్ఆర్టీసీ హైదరాబాద్ డిపో-1 మేనేజర్ కృష్ణారెడ్డి అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించడంపట్ల ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం గౌలిగూడలోని హైదరాబాద్ డిపో-1 ఆవరణలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టుకొని సంబురాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిపో-1 ఎంఎఫ్ దనుంజయ్, సీఐ స్వాతి, మెకానికల్ సూపర్వైజర్, వెల్ఫేర్ బోర్డు సభ్యులు వెంకన్న, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.
హకీంపేట డిపోలో…
ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని హకీంపేట ఆర్టీసీ డిపో కార్మిక సంఘం కార్యదర్శి గోపు శ్రీనివాస్ అన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల ప్రభుత్వంలో విలీనం చేసినందుకు శుక్రవారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర నాయకులు బాలరాజ్‌గౌడ్, పవన్‌కుమార్, సుగుణచారి, ఎండీ మౌలాన, బొట్టు శీను, సుజాత, పుష్పలత, నవనీత, సుంపూర్ణ, సునీత, విధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.