సిటీబ్యూరో, ఆగస్టు 23(నమస్తే తెలంగాణ) : మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు రూ. 375 కోట్లను కాంగ్రెస్ సర్కారు మంజూరు చేసింది. మూసీ అభివృద్ధికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 1500 కోట్లను మంజూరు చేయాల్సి ఉండగా… ఇప్పటివరకు రెండు దఫాలుగా రూ. 375 కోట్లు మంజూరు చేసింది.
మిగిలిన మొత్తాన్ని మరో రెండు త్రైమాసికాల్లో కేటాయించనుండగా, ఈ నిధులను మూసీ అభివృద్ధి పనులకు వినియోగించాలని ప్రభుత్వం సూచించింది. ఇప్పటివరకు చేపట్టిన పనులపై నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.