Traditional occupation | బీసీ కుల వృత్తి దారులకు ఒక లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని వందశాతం సబ్సిడీతో అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు జిల్లాలో అర్హులైన వారికి ఒక లక్ష రూపాయలు అందించడానికి దరఖాస్తులు కోరుతూ జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి ఆశన్న నోటిఫికేషన్ జారీ చేశారు.
ఈ మేరకు ఆన్లైన్ దరఖాస్తుల కోసం https://tsobmmsbc.cgg.gov.in ద్వారా సంబంధించిన ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా బీసీ తరగతుల అభివృద్ధి అధికారి తెలిపారు. ఈ మేరకు 040-27428478 సంప్రదించాలన్నారు.