రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లో ఓ ఇంజినీరింగ్ కాలేజీలో భారీ చోరీ (Theft) జరిగింది. అబ్దుల్లాపూర్మెట్ పరిధిలోని బ్రిలియంట్ ఇంజినీరింగ్ కాలేజీలో దుండగులు రూ.కోటి ఎత్తుకెళ్లారు. గుర్తించిన కాలేజీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కాలేజీని పరిశీలించారు. కళాశాల పరిసరాల్లో సీసీ కెమెరా పుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ ఘనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.