సిటీబ్యూరో, మార్చి 11 (నమస్తే తెలంగాణ): ఫైనాన్సియల్ సర్వీసెస్ లిమిటెడ్ పేరుతో ఓ సీనియర్ మేనేజర్‌ను సైబర్‌నేరగాళ్లు బ్లాక్ ట్రేడింగ్ పేరుతో రూ.1.07 కోట్లు బురిడీ కొట్టించారు. రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్‌పేట్‌కు చెందిన బాధితురాలు ఓ ప్రైవేట్ సంస్థలో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు ట్రేడింగ్‌పై అవగాహన ఉంది, ఈ క్రమంలోనే ఎఫ్ 5జెం ఫైనాన్సియల్ సర్వీసెస్ లిమిటెడ్ అనే సంస్థ వాట్సాప్ గ్రూప్‌లో చేరింది. ఆ తరువాత ట్రేడింగ్‌కు సంబంధించిన మెలుకువలు నేర్చుకోవాలంటూ అందుకు శృతి భాట్య , పృథ్వీ టి కిలాచంద్ల పేరుతో ఇద్దరు మాట్లాడుతూ సలహాలు చూచనలు చేశారు.
దీంతో ఆమె వారి సూచనలతో డబుల్యుయువైక్యూఎజెడ్.కామ్ వెబ్సైట్, జేఎంఎఫ్ఎస్ మ్యాక్స్ యాప్‌లను డౌన్లోడ్ చేసుకొని వాటి ద్వారా ట్రేడింగ్ మొదలు పెట్టింది. మొదట రూ. 10 వేలు, ఆ తర్వాత రూ. 25 వేలు, రూ. 1.63 లక్షలు పెట్టుబడి పెట్టడంతో కొన్ని లాభాలు వచ్చాయి. ఇందులో ఎక్కువ లాభాలు రావని వీఐపీ గ్రూప్‌లో పెట్టుబడి పెడితే బ్లాక్ ట్రేడింగ్‌తో భారీ లాభాలు వస్తాయంటూ నేరగాళ్లు బాధితురాలికి సూచించారు. తన ఖాతాలో రూ. 67 లక్షలు, తండ్రి ఖాతాలో రూ. 46 లక్షలు డిపాజిట్ చేసింది. అయితే ట్రేడింగ్ యాప్‌లో స్కీన్ప్రై కోట్ల రూపాయల లాభం చూపిస్తోంది, దీంతో ఆమె రూ. 17,28,00 చెల్లించింది. అయినా కూడా విత్ డ్రా చేసుకునే అవకావాన్ని కల్పించలేదు. ఇలా ఆమె పెట్టిన పెట్టుబడిలో కొన్ని తిరిగి వచ్చినా రూ. 1,07,13,266 మోసానికి గురయ్యింది. దీనిపై బాధితురాలు రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.