వికారాబాద్, అక్టోబర్ 14, (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తామని ఆర్ఆర్ఆర్ బాధితులు తెలిపారు. మంగళవారం నవాబుపేట్ మండలం చించల్‌పేట్‌లో సమావేశమైన రీజినల్ రింగ్‌రోడ్డు బాధిత రైతులు మండలాల వారీగా జేఏసీలను ఏర్పాటు చేసుకున్నారు. రీజినల్ రింగ్‌రోడ్డు కొత్త అలైన్‌మెంట్‌ను ప్రభుత్వం తప్పనిసరిగా మార్చాలని లేదంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. ఉత్తర, దక్షిణ తెలంగాణ రీజినల్ రింగ్‌రోడ్డు బాధిత రైతులంతా ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. 200 మంది రైతులు నామినేషన్లు దాఖలు చేసి జూబ్లీహిల్స్ నియోజకవర్గమంతటా ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ఓటర్లకు తెలియజేస్తామని వెల్లడించారు.
కొత్త అలైన్మెంట్ మార్చాల్సిందే, లేదంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఆర్ఆర్ఆర్ బాధిత 200 మంది రైతులమంతా కలిసి నామినేషన్ వేసి, ప్రభుత్వాన్ని నిలదీసి కా ంగ్రెస్ పార్టీని ఓడిస్తాం. అలైన్‌మెంట్‌ను మార్చకపోతే మోమిన్‌పేట్ మండలం నుంచి కొడంగల్ వరకు పాదయాత్ర చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తాం.
-కృష్ణారెడ్డి, నవాబుపేట్ జేఏసీ అధ్యక్షుడు
కేసీఆర్ ఉన్నప్పుడు 10 కిలోమీటర్ల దూరంలో రీజినల్ రింగ్‌రోడ్డు వెళ్లే లా అలైన్మెంట్ చేశా రు. కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చిన తర్వాత అలైన్మెంట్ ఎందుకు మార్చారో అందరికీ తెలుసు . కొత్త అలైన్మెంట్ మార్చకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం, మా ప్రాణాలైనా ఇస్తాం, పిల్లలకైనా భూములు దక్కుతాయి.
-జనార్దన్ రెడ్డి, వికారాబాద్ జేఏసీ అధ్యక్షుడు