సిటీబ్యూరో, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): సత్ప్రవర్తన కల్గిన రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్లను ఇంటికే పరిమితం చేయకుండా వారితో సామాజిక సేవలు చేయించేందుకు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కమిషనర్ ఆదేశాల మేరకు ఎస్హెచ్ఓలు..
సత్ప్రవర్తన కలిగిన పలువురు రౌడీషీటర్లను బుధవారం ఉప్పల్, ఎల్బీనగర్, ఈసీఐఎల్ ప్రాంతాలలో ట్రాఫిక్ నిర్వాహణలో భాగస్వాములు చేశారు. ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలోని వాళ్లతో ట్రాఫిక్ వలంటీర్లుగా పనిచేయించారు. మరికొందరు రౌడీషీటర్లను కూడా ఇలాంటి కార్యక్రమంలో భాగస్వామ్యం చేయనున్నట్లు వెల్లడించారు.