సిటీబ్యూరో: నారాయణగూడలోని ఇండియన్ దర్భార్ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు తనిఖీలు నిర్వహించారు. వంటగదిలో అప్రరిశుభమైన వాతావరణం, బొద్దింకల బెడద ఉన్నట్లు గుర్తించారు. కుళ్లిన టామోట, పచ్చిమిర్చి, క్యారెట్లు, సింథటిక్ ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లు తేల్చారు. మసాలా పౌడర్ , జీలకర్ర పొడి ఇతర వస్తువులు గడువు ముగిసినట్లు గుర్తించి, వాటిని సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నారు. లక్డీకాపూల్‌లోని హోటల్ అశోకలో వంటగది గోడలు అపరిశుభ్రంగా ఉండడం, దుర్వాసన వస్తుండడాన్ని గమనించారు. బొద్దింకల తాకిడి, ఫ్రిజ్‌లో ఉన్న పాత్రలు తుప్పు పట్టినట్లు గుర్తించారు. సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడినట్లు తేల్చారు. కుళ్లిపోయిన బెండకాయలు, క్యాలీఫ్లవర్‌ను గుర్తించి వాటిని పారబోశారు. గడువు ముగిసిన వస్తువులు, కర్రీ కట్ చికెన్‌ను స్వాధీనం చేసుకున్నారు.