హైదరాబాద్: హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో 13 ప్రాంతాల్లో 16 హాల్స్‌లో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ (Ronald Ross) అన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి సెల్ఫోన్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. నిజాం కాలేజీలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో 3 చోట్ల పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తామని చెప్పారు. ప్రతి కౌంటింగ్ హాల్లో 14 టేబుళ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. జూబ్లీహిల్స్‌లో 20 టేబుళ్లు, యాకుత్‌పురాలో 24 రౌండ్లలో, చార్మినార్ నియోజకవర్గంలో 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు.
ఇక కంటోన్మెంట్ ఉపఎన్నిక ఓట్లను 17 రౌండ్లలో లెక్కిస్తామని చెప్పారు. ప్రతి రౌండ్‌కు 30 నిమిషాల సమయం పడుతుందన్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ఐదు వీవీ ప్యాట్ల స్లిప్పులను లెక్కిస్తామన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక అబ్జర్వర్ ఉంటారని చెప్పారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఎన్కోర్లో డేటా నమోదుచేస్తారన్నారు. కౌంటింగ్ సిబ్బందికి మే 26 నాటికే శిక్షణ పూర్తయిందని తెలిపారు.