సిటీబ్యూరో, నవంబరు 4(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు నిఘా బృందాలు పనిచేస్తున్నాయని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ అన్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జిల్లాకు వచ్చిన ఎన్నికల వ్యయ పరిశీలకులు ఆయా శాఖలకు నియమించిన నోడల్ అధికారులు, ఎన్నికల నోడల్ అధికారులు, ఎన్నికల వ్యయ పరిశీలకులకు రొనాల్డ్ రోస్ వివరించారు. అక్రమ మద్యం, నగదు, బంగారం ఎన్నికల ప్రభావాన్ని తగ్గిచేందుకు సర్వేలేన్స్ టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు, ఒక్కో నియోజకవర్గానికి మూడు ఫ్లయింగ్ స్కాడ్ టీమ్‌లు ఏర్పాటు చేసి మొత్తం 45 టీమ్‌లు 24 గంటల పాటు ఎన్నికల నోటిఫికేషన్ నుంచి పనిచేస్తున్నాయని చెప్పారు.
ఇప్పటి వరకు జరిగిన తనిఖీల్లో నగదు, ఆభరణాలు రూ.3.45 కోట్లు సీజ్ చేశారని రొనాల్డ్ రోస్ వివరించారు. ఈ సందర్భంగా ఎన్నికల వ్యయ పరిశీలకులు, ఎంసీఎంసీ కంట్రోల్, ఎన్నికల హెల్ప్‌లైన్ 1950 కంట్రోల్ రూంలను జిల్లా ఎన్నికల అధికారితో పాటు వ్యయ పరిశీలకులు పరిశీలించారు. ఈ నేపథ్యంలో సీజ్ చేసిన మొత్తాన్ని పార్టీలకు గాని, అభ్యర్థికి గాని సంబంధం కానిది ఎప్పటికప్పుడు ప్రజలకు ఇచ్చేందుకు అడిషనల్ కలెక్టర్ అధ్యక్షతన జిల్లా ఫిర్యాదు కమిటీ విచారణ చేసి విడుదల చేస్తున్నామని రొనాల్డ్ రోస్ వివరించారు. ఈ సమావేశంలో ఆయా నియోజకవర్గాలకు చెందిన వ్యయ పరిశీలకులు, నోడల్ అధికారులు, సీపీ సందీప్ శాండిల్య, అదనపు సీపీ విక్రమ్ సింగ్ మాన్, జిల్లా కలెక్టర్, డిప్యూటీ డీఈఓ అనుదీప్ దురిశెట్టి, అడిషనల్ కమిషనర్ శంకరయ్య, అదనపు కలెక్టర్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్ కలెక్టరేట్, నవంబర్ 4: ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యయ పరిశీలకులు ప్రేమ్ ప్రకాష్, బాలా సాహెబ్ బాపూరావు అన్నారు. శాసనసభ ఎన్నిల నేపథ్యంలో శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నోడల్ అధికారులు, సహాయ వ్యయ పరిశీలకులు, తదితర బృందాలు, ఎన్నికల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్నికల సంబంధించిపన ఆయా అంశాలపై సమావేశం నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీవో శ్రీనివాస్ మూర్తి, డీటీవో నర్సింహ, తదితరులు పాల్గొన్నారు.