Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ నగరం గుండా ప్రవహించే మూసీ నదికి ఇటీవల వరద పోటెత్తిన సంగతి తెలిసిందే. గత 30 ఏండ్లలో ఎన్నడు లేనంత వరద మూసీకి వచ్చింది. దీంతో మూసీ నది ఉధృతంగా ప్రవహించింది. ఈ క్రమంలో మూసీ నది పరివాహక ప్రాంతాల్లో పాములు, తేళ్లు, ముంగిసలు ప్రత్యక్షమయ్యాయి. పలు కాలనీల్లోకి పాములు, ముంగిసాలు, తేళ్లు, పైథాన్లు, మొసళ్లు చేరుకుని భయానక వాతావరణాన్ని సృష్టించాయి.
హైకోర్టు సమీపంలో ఉన్న ప్రభుత్వ సిటీ కాలేజీ వద్ద ఇవాళ రాక్ పైథాన్ కలకలం సృష్టించింది. భారీగా ఉన్న ఈ పామును చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పైథాన్ను గమనించి స్నేక్ క్యాచర్కు సమాచారం అందించారు. భయంకరంగా ఉన్న రాక్ పైథాన్ను స్నేక్ క్యాచర్ బంధించాడు. అనంతరం దాన్ని అటవీశాఖ అధికారులకు అప్పగించారు.
కిషన్బాగ్, మహమ్మద్ నగర్, బహదూర్ పురా, అసద్బాబా నగర్, శంకర్ నగర్, మూసానగర్, రసూల్ పురా, చాదర్ఘాట్ ఏరియాల్లో కూడా పాములు, తేళ్లు కలకలం సృష్టించాయి. మూసీకి వరద తగ్గిన తర్వాత జనావాసాల్లోకి పాములు, తేళ్లు రావడంతో జనాలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అసద్ బాబా నగర్ ఏరియాలో తొలిసారిగా ముంగిసాను చూసినట్లు స్థానికుడు షకీల్ పేర్కొన్నాడు. దీనిపై పోలీసులకు సమాచారం అందించామని తెలిపాడు.
హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని సిటీ కాలేజీ దగ్గర రాక్ పైథాన్ పాము కలకలం pic.twitter.com/VUol5jTl2Q
— Telugu Scribe (@TeluguScribe) October 1, 2025