సిటీబ్యూరో: ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖానలో మొదలైన రోబో శస్త్రచికిత్సలు 30 రోజుల్లోనే సెంచురీకి చేరుకున్నాయి. గతేడాది సెప్టెంబర్ 18న ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్లో రోబోను నాటి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించిన విషయం తెలిసిందే. క్యాన్సర్ రోగులకు అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సలను రోబో ద్వారా చేస్తున్నట్లు ఎంఎన్‌జే డైరెక్టర్ డాక్టర్ జయలత తెలిపారు.
‘రోబోటిక్ సర్జరీ చేయడంలో ప్రస్తుతం ఆరు మంది సీనియర్ వైద్యులు శిక్షణ పూర్తి చేసుకున్నారు. మరో 14 మంది దశల వారీగా ట్రైనింగ్ తీసుకుంటున్నారు. నెల రోజుల కిందట ఇక్కడ రోబో సర్జరీలు అందుబాటులోకి వచ్చాయి. అత్యంత క్లిష్టమైన సర్జరీలను రోబో ద్వారా చేస్తున్నాం. తక్కువ సమయంలోనే ఎక్కువ ఆపరేషన్లు చేయగలుగుతున్నాం’ అని తెలిపారు.