
కంటోన్మెంట్, ఆగస్టు 13 : యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘించి ద్విచక్ర వాహనంపై ఐదుగురు ప్రయాణిస్తూ ప్రమాదబారిన పడ్డారు. ఆర్టీసీ బస్సు తగిలి అదుపు తప్పి కిందపడడంతో మహిళ దుర్మరణం పాలైంది. కార్ఖాన సీఐ రవీందర్ వివరాల ప్రకారం..అల్వాల్‌కు చెందిన శీను, రమణమ్మలు తన కుటుంబసభ్యులు ఐదుగురు కలిసి పల్సర్ బైక్‌పై శుక్రవారం ఉదయం జేబీఎస్ నుంచి అల్వాల్‌కు బయల్దేరారు. కార్ఖాన అనుభవ్ గార్డెన్స్ సమీపంలో ఆర్టీసీ వేములవాడ డిపో సూపర్ లగ్జరీ బస్సు బైక్ వెనుకభాగాన్ని తగలడంతో అదుపుతప్పగా రమణమ్మ కిందపడిపోయింది. ఆమె పైనుంచి బస్సు వెళ్లడంతో తల ఛిద్రమై అక్కడికక్కడే మృతిచెందింది. మిగిలిన నలుగురికి స్వల్ప గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.