మారేడ్‌పల్లి, డిసెంబర్ 13: సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న లీజు స్థలాలకు యాజమాన్య హక్కులను కల్పించాలని మంగళవారం న్యూక్లబ్ అధ్యక్షుడు నోముల ప్రకాశ్‌రావు ఆధ్వర్యంలో పలువురు మంత్రి శ్రీనివాస్ యాదవ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
వెస్ట్‌మారేడ్‌పల్లి, ఆర్పీరోడ్డు, మోండా, హైదర్‌గూడ, కింగ్స్ వే, జీరా, న్యూ బోయిగూడ తదితర ప్రాంతాల్లో సుమారు 760 లీజు స్థలాలు ఉన్నాయని దాదాపు కొన్ని దశాబ్ధాల నుంచి ఇందులో లీజుదారులు కొనసాగుతున్నా, వారికి యాజమాన్య హక్కులు దక్కలేదని మంత్రికి వివరించారు. 1.68 ఎకరాల స్థలంలో కొనసాగుతున్న మారేడ్‌పల్లి న్యూక్లబ్ కూడా 1944 లో లీజుకు తీసుకొని నడిపిస్తున్నామని దీని పై 23 మార్చి 1997 లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ యాజమాన్య హక్కుల ప్రపోజల్స్‌ను సీసీఎల్ఏ కు నివేదించినా ఇంత వరకు యాజమాన్య హక్కులు తమకు దక్కలేదని వెల్లడించారు.