హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి పాలను గాలికొదిలేసి పార్టీ ఫిరాయింపులు, ఢిల్లీ టూర్లకు తిరుగుతుండటంతో రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్థంగా మారింది. అధికారుల అలసత్వానికి అడ్డేలేకుండా పోయింది. సమస్యలు చెప్పుకున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఇక హాస్టల్స్ ఉండే విద్యార్థుల పరిస్థితులు మరింత దారుణంగా తయారైంది. పురుగుల అన్నం(Worms rice ), నీళ్లు చారు తినలేక విద్యార్థులు పస్తులుంటున్నారు. తాజాగా కుత్బుల్లాపూర్ – సూరారంలో ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహానికి ( Government SC boys hostel )తెల్ల పురుగులతో కూడిన బియ్యం సరఫరా అవుతున్నాయి.
గోదాం నుంచి వచ్చిన వీటిని కొన్నిసార్లు సిబ్బంది శుభ్రం చేయ కుండా వండుతుండడంతో ఆ అన్నాన్ని విద్యార్థులు తినలేకపోతున్నారు. వసతి గృహంలో సుమారు 70 మంది డిగ్రీ, బీటెక్ విద్యార్థులు ఉంటున్నారు. వీరికి మేడ్చల్ ప్రభుత్వ గోదాం నుంచి బియ్యం సరఫరా అవుతుంటాయి. నెలక్రితం వరకు వీటిలో అరకొరగా తెల్ల పురుగులు వస్తుండేవి. సిబ్బంది వీటిని శుభ్రం చేసి వండి పెట్టేవారు. కాని 15 రోజులుగా పురుగులు ఎక్కువ కావడంతో సరిగ్గా శుభ్రం చేయడం లేదు. మేడ్చల్ జిల్లా పరిధిలోని 7 వసతి గృహాల్లోనూ ఇదే పరిస్థితి ఉందంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు.