రైస్ ఏటీఎం @365 రోజులు

సామాజిక కార్యకర్త దోసపాటి రాము సేవలు అభినందనీయమని బిగ్బాస్ ఫేం శివజ్యోతి అన్నారు. కరోనా కారణంగా జీవనోపాధి కోల్పోయిన పలు కుటుంబాలను ఆదుకునేందుకు దోసపాటి రాము నాగోల్ డివిజన్ రాక్హిల్స్ కాలనీలో ప్రారంభించిన రైస్ ఏటీఎం 365 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా శనివారం రైస్ ఏటీఎంను ప్రముఖ యాంకర్ శివజ్యోతి సందర్శించారు. కొన్ని రైస్ బ్యాగులు అందజేసి నిరుపేదలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహమ్మారి విజృంభణతో ఆకలితో అలమటించిన నిరుపేదలకు నిత్యావసర సరుకులతో పాటు ఎన్నో కుటుంబాలను ఆదుకునేందుకు కుట్టు మిషన్లు, టిఫెన్ సెంటర్లు, కొబ్బరి బోండాల షాపులు, ఇస్త్రీ, కిరాణ, పిండిగిర్నీలు అందజేసి ఉపాధి కల్పించిన దోసపాటి రాము సేవలను ఆమె కొనియాడారు. దోసపాటి రామును ఆదర్శంగా తీసుకొని మరికొందరు సమాజ సేవలో పాలుపంచుకోవాలన్నారు. సామాజిక కార్యకర్త దోసపాటి రాము మాట్లాడుతూ కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవడమే తన లక్ష్యమన్నారు. ఆరోగ్య సమస్యలతో పాటు చదువుకునే ఆర్థిక స్థోమత లేని పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించామన్నారు. కార్యక్రమంలో వలంటీర్లు రాఘవేంద్ర, సైదులు, రాకేశ్, నాగేశ్, మహేశ్, నాగరాజు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- RICE ATM
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

