ఉస్మానియా యూనివర్సిటీ, మే 19 : రాష్ట్రంలోని యాదవ, కురుమలను అవమానిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తక్షణమే గొల్ల కురుమలు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ఈనెల 24వ తేదీలోగా క్షమాపణ చెప్పాలని ఓయూ జేఏసీ, గొల్లకురుమ విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే ఈనెల 25వ తేదీన గాంధీభవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఉస్మానియా యూనివర్సిటీలోని స్టూడెంట్ డిస్కోర్స్ సెంటర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో విద్యార్థి నాయకులు మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి అహంకారంతో గొల్ల కురుమ జాతిని, వారి వృత్తి, జీవనశైలిని కించపరిచేలా మాట్లాడుతున్నారన్నారు. మంత్రి తలసానిని వ్యక్తిగతంగా కాకుండా మొత్తం గొల్ల కురుమ జాతిని కించపరిచేలా మాట్లాడటం తగదని హితవు పలికారు. రేవంత్ వ్యాఖ్యలతో యాదవ, కురుమల మనోభావాలు దెబ్బతిన్నాయని ధ్వజమెత్తారు. రేవంత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ వైఖరి తెలియజేయాలని, లేనిపక్షంలో జరగబోయే పరిణామాలకు కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీజీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు నక్క శ్రీశైలం యాదవ్, ఓయూ జేఏసీ చైర్మన్ కావటి సతీశ్‌యాదవ్, టీఎస్‌జేఏసీ అధ్యక్షుడు పోగుల చిరంజీవి యాదవ్, తలసాని యువసేన అధ్యక్షుడు రెమడాల శ్రీకాంత్‌యాదవ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి బొల్లు నాగరాజు యాదవ్, నాగారం ప్రశాంత్, ఓయూజేఏసీ నాయకులు వేల్పుకొండ రామకృష్ణ, నాగేందర్రావు, అభినాశ్, శ్రవణ్, నగేశ్, మల్లేశ్, రమేశ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.