సిటీబ్యూరో, సెప్టెంబర్ 28(నమస్తే తెలంగాణ) : హెచ్ఎండీఏ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టులు ఓవైపు శంకుస్థాపనలు, మరోవైపు రాస్తారోకోలతో సాగాయి. ఆదివారం అవుటర్ రింగు రోడ్డు నుంచి ఫ్యూచర్ సిటీకి గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రింగు రోడ్డుకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయగా… అదే సమయంలో నార్త్ సిటీ వైపు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ భూ బాధితులు రోడ్డెక్కారు.
నగరంలో కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్న ముఖ్యమంత్రి… ప్రజా అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని, ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుతో సర్వం కోల్పోయి రోడ్డున పడుతున్నామని ఆవేదనతో రోడ్డెక్కారు. అదేవిధంగా రేడియల్ రోడ్డు భూ బాధితులు కూడా ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు.
18 కిలోమీటర్ల పొడవున నార్త్ సిటీ మీదుగా హెచ్ఎండీఏ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి ఏడాదిన్నర కిందట శంకుస్థాపన చేశారు. నగరానికి తొలి డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుగా ఆవిష్కరించారు. కానీ ఇప్పటి వరకు భూసేకరణ పూర్తి కాలేదు. అయితే గడిచిన ఏడాది నుంచి నగరంలో ఎలివేటెడ్ కారిడార్‌కు నిరసనగా వందలాది మంది భూ బాధితులు ఆందోళనలు చేస్తున్నారు. 200 ఫీట్ల వెడల్పు ఉన్న రోడ్డు ప్రతిపాదనను 100-150 ఫీట్లకు తగ్గించాలని, అదేవిధంగా భూ పరిహారం అంశాన్ని తేల్చాలనే ప్రధాన డిమాండ్లతో రాజీవ్ రహదారి భూ పరిరక్షణ.