మెహిదీపట్నం : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే నగరంలో తిరగకుండా చేస్తామని కార్వాన్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ఇన్‌ఛార్జి ఠాకూర్ జీవన్‌సింగ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డిని హెచ్చరించారు.
బుధవారం లంగర్‌హౌస్ చౌరస్తాలో సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి దిష్టి బొమ్మను టీఆర్ఎస్ పార్టీ నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గం ఇన్‌ఛార్జి ఠాకూర్ జీవన్‌సింగ్ మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ల అధ్యక్షులు,కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.