సిటీబ్యూరో, మార్చి 23 (నమస్తే తెలంగాణ): చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు మీరు పాల్పడ్డారనే అభియోగంపై కేసు నమోదు చేశాం, దీనిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణ కొనసాగుతుందని ఓ రిటైర్డు రైల్వే ఉద్యోగిని డిజిటల్ అరెస్ట్ చేసి రూ.80.5 లక్షలు సైబర్‌నేరగాళ్లు కొట్టేశారు. ఉప్పల్‌కు చెందిన బాధితుడికి డాటా ప్రొటెక్షన్ బోర్డు అఫీసర్నంటూ ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. మీ ఆధార్‌ను ఉపయోగించి చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరిగాయని, దీనిపై కోలబా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైందని దీనిపై వీడియోలో మాట్లాడాలంటూ సూచించారు.
తరువాత వీడియో కాల్లో మాట్లాడి తమకు తాముగా పోలీస్ అధికారినంటూ సైబర్‌నేరగాళ్లు పరిచయం చేసుకున్నారు. మీపై ఎఫ్ఐఆర్ నమోదైందని, మీ బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం కార్డు వివరాలు తమ వద్ద ఉన్నాయని ఈ కేసు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉం దంటూ నమ్మించారు. దీంతో బాధితుడు డబ్బులను దఫదఫాలుగా బదిలీ చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.