కుత్బుల్లాపూర్, జూలై 1: ప్రజా సమస్యల పరిష్కారమే మా ఎజెండగా ముందుకు సాగామని, గత తొమ్మిదేళ్ల పరిపాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చినందుకే తన ప్రగతియాత్రకు ప్రజల నుంచి విశేష ఆదర ణ వస్తుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకాంద్ అన్నారు. శనివారం జీడిమెట్ల డివిజన్ పరిధిలోని శ్రీదుర్గా ఎస్టేట్‌లో ఎమ్మెల్యే.. తన ప్రగతియాత్రలో భాగంగా 80వ రోజు పర్యటించారు. కాలనీల్లో రూ.75 లక్షల వ్యయంతో సీసీరోడ్లు, మంచినీటి సౌకర్యం కల్పించినందుకు కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తూ పూలదండలు, శాలువాలు కప్పి సత్కరించారు. ఇంకా కాలనీల్లో మిగిలి ఉన్న సమస్యలను సకాలంలోనే పరిష్కరించేందు కు కృషి చేస్తానని కాలనీవాసులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు నాడు ఇచ్చిన హామీలను..నేడు రిష్కరించుకునే రోజులకు వచ్చామన్నారు. కోట్ల వ్యయంతో నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకునే అవకాశాన్ని సీఎం కేసీఆర్, పురపాలక శాఖామంత్రి కేటీఆర్‌లు కల్పించారని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలను దృష్టిలో పెట్టుకొని రోడ్లు, ఫ్లైఓవర్లు, ఇతర అభివృద్ధి నిర్మాణాలు చేపడుతున్నామని తెలిపారు. అభివృద్ధిని చూసే ప్రజలు తన ప్రగతియాత్రకు బ్రహ్మారథం పట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని ప్రజల సహకారంతో మరింత ఆదర్శవంతం గా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు సంపతి మాధవరెడ్డి, గుమ్మడి మధుసూదన్రాజ్, జ్ఞానేశ్వర్‌ముదిరాజ్, కుంట సిద్ధిరాములు, వీరారెడ్డి నరేందర్‌రెడ్డి, కాలనీ అధ్యక్షుడు విఠల్, కార్యదర్శి నంబూరి, ఉపాధ్యక్షుడు పార్ధసారథిరెడ్డి, వాటర్‌వర్క్ డీజీఎం రాజేశ్, ఏఈ సురేందర్నాయక్తో పాటు పార్టీ శ్రేణులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
నియోజకవర్గానికి చెందిన పలు కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు శనివారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ను క్యాంపు కార్యాలయంలో కలిసి స్థానికంగా మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ వినతిపత్రాలను అం దించారు. వెంటనే ఎమ్మెల్యే.. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను త్వరిగతిన పరిష్కరిం చాలని సూచించారు. ఆయా కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు.